నరకాసురులతో జాగ్రత్త.. కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
X
‘మనలో అంతర్‌జ్యోతి వెలిగినప్పుడే జీవితంపై స్పష్టత ఏర్పడి ప్రతి రోజూ పండుగలా ఆవిష్కృతం అవుతుంది. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలని, ప్రతి ఇల్లు సకలశుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటామని, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ ఆయన చెప్పారు. దీపావళికి హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యమున్నదని, జీవానికి సంకేతమైన అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణనిస్తాయని అన్నారు.
‘‘మనం పయనించే ప్రగతిపథంలో అడుగడుగునా అడ్డుపడే నరకాసురుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజల సంక్షేమాన్ని కోరి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటాకులు కాలుస్తూ దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలి’’ అని కోరారు.Telangana cm kcr wishes people on the eve of Diwali celebrations