నిర్మల్ జిల్లాకు కేసీఆర్ వరాలు..
X
నిర్మల్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు భారీగా నిధులు కేటాయించారు. 396 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షలు, నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున, జిల్లాలోని 19 మండలాలకు రూ.25లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం అనంతరం ఎల్లపెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మల్ జిల్లా విద్యాశాఖను అభినందించారు. ఇటీవల విడుదలై పదో తరగతి ఫలితాల్లో మొత్తం తెలంగాణలోనే నిర్మల్ జిల్లా నంబర్ వన్‌గా నిలవడంతో..టీచర్లను, విద్యార్థులను కేసీఆర్ ప్రశంసించారు.
-బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. అద్భుతంగా ఆలయం నిర్మించుకుందామన్నారు. మళ్లీ ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనకు వస్తాను’ అని కేసీఆర్ తెలిపారు. అడివి జిల్లాగా పేరును ఆదిలాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఏర్పాటు చేసుకుని వివరించారు. కొత్తగా మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయని కేసీఆర్ స్పష్టం చేశారు.