ఇంతకు మించిన తృప్తి ఏముంటుంది!.. రేవంత్
X
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం పంజాగుట్టలోని సీఎం అధికార నివాసం ప్రజాభవన్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. వందలాది ప్రజల సమస్యలు విని అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉద్యోగాలు కావాలని, చికిత్స కోసం ఆర్థిక సాయం కావాలి కొందరు కోరారు. రేషన్ కార్డులు, ఇల్లు కావాలని, మౌలిక సాదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నామని కొందరు సీఎంకు దరఖాస్తులు అందజేశారు. వికలాంగులు, నిరుద్యోగుల పెద్ద సంఖ్యలో హాజరై తమ గోడు వెళ్లబోసుకున్నారు. రేవంత్ వారి సమస్యలను ఓపిగ్గా విని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పోలీసులు, అధికారులు.. ప్రజలకు ఏ ఇబ్బందీ లేకుండా చర్యలు తీసుకున్నారు. మంచినీళ్ల సీసాలను కూడా ప్రజలకు అందించారు.
ప్రజా దర్బార్ ముగిశాక రేవంత్ ట్వీట్ చేశారు.
‘‘జనం కష్టాలు వింటూ…
కన్నీళ్లు తుడుస్తూ
తొలి ప్రజా దర్బార్ సాగింది.
జనం నుండి ఎదిగి…
ఆ జనం గుండె చప్పుడు విని…
వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుంది!’’
ట్వీట్‌తోపాటు ప్రజా దర్బార్ వీడియోను షేర్ చేశారు. మంత్రివర్గ కూర్పు, ఇతర అంశాలపై అధిష్టానంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీకి బయల్దేరారు.
జనం కష్టాలు వింటూ…
— Revanth Reddy (@revanth_anumula) December 8, 2023
కన్నీళ్లు తుడుస్తూ
తొలి ప్రజా దర్బార్ సాగింది.
జనం నుండి ఎదిగి…
ఆ జనం గుండె చప్పుడు విని…
వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుంది!#TelanganaPrajaPrabhutwam pic.twitter.com/E71r3lYlur