Home > తెలంగాణ > అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం.. CM Revanth Reddy

అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం.. CM Revanth Reddy

అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం.. CM Revanth Reddy
X

జలదోపిడీకి కారణం గత ముఖ్యమంత్రి కేసీఆరే కారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్, చంద్రబాబుతో కేసీఆర్ కుమ్మక్కై తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు.. 60 ఏళ్లలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు.. తెలంగాణ నీటి హక్కుల కోసం తమ ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడుతున్నదని, కేసీఆర్‌ జనంలోకి వచ్చేందుకు మొహం చెల్లక మాయమాటలు చెబుతున్నారన్నారు. " రాయలసీమలో కృష్ణా ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో కేసీఆర్ అధికారంలో ఉన్నారు. 2014 లో నే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మొదలుపెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ఏదైనా నష్టం జరిగితే కేసీఆర్ దే బాధ్యత. ఇప్పుడు కేసీఆర్ ఉద్యమాలు చేస్తానంటే ప్రజలే కొడతారు. చంద్రబాబు, జగన్ లు ప్రాజెక్ట్ లు కడుతుంటే అడ్డుకోకుంటే కేసీఆర్ ఏం చేశారు" అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

నదీ జలాలపై శాసనసభలో చర్చపెడతామని , చర్చకు కేసీఆర్ తప్పకుండా రావాలన్నారు సీఎం. ప్రాజెక్టులపై కేసీఆర్‌ ఎంతసేపైనా మాట్లాడొచ్చు.. తాము అడ్డురామని అన్నారను. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. కేసీఆర్ కు అధికారం పోయాక ఎక్కడ నొప్పి పుడుతుందో తెలంగాణ ప్రజలకు తెలుసని, ప్రాజెక్టులపై అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి రెడీగా ఉన్నామన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలన్నారు. కాలు నొప్పి, కంటి నొప్పి అని డ్రామాలు చేయొద్దు" అని అన్నారు. జగన్ తెలంగాణకు రావాల్సన నీరు ఎత్తుకుపోతుంటే నోరు మెదపలేదన్నారు . గ్రావిటీ ద్వారా వచ్చే కృష్ణా నీటిని వదిలేసి కాళేశ్వరం కోసం పరుగులు పెట్టారు. ఎన్నికల వేళ నాగార్జున సాగర్‌ డ్యామ్‌ను జగన్‌ ఆక్రమిస్తే కేసీఆర్‌ స్పందించలేదు. సాగర్ మీదికి ఏపీ పోలీసులు వస్తే ఏం చేసినవ్ అని కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్ . దమ్ముంటే ఇవాళ సాగర్ మీదికి పోలీసులను రమ్మను చూద్దామన్నారు.

" రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా నీరు తరలింపునకు ఏపీ సీఎం జగన్‌ ప్రణాళిక వేశారు. రాయలసీమ ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు కేసీఆర్‌ సహకరించారు. కేసీఆర్‌ హయాంలోనే రాయలసీమ, ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టులు మొదలయ్యాయి. జగన్‌ ఒత్తిళ్లకు కేసీఆర్‌ లొంగిపోయారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును అప్పటి సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యం చేశారు. రోజుకు 8 టీఎంసీలు ఏపీకి తరలించడానికి కేసీఆర్‌ అనుమతిచ్చారు. మే 5, 2022న ఈ మేరకు జీవో ఇచ్చారు. గతంలో చంద్రబాబు హయాంలో ముచ్చుమర్రి కట్టారు. 800 అడుగుల వద్ద నీటి తరలింపునకు ప్రయత్నించారు. దానికీ కేసీఆర్‌ సహకరించారు. గతంలో కృష్ణానదిపై ప్రాజెక్టులపై ఆధిపత్యం తెలంగాణ చేతిలో ఉండేది. కానీ, వైఎస్‌, చంద్రబాబు, జగన్‌ ఒత్తిళ్లకు కేసీఆర్‌ లొంగిపోయారు. పదవులు, కమీషన్లకు లొంగి జలదోపిడీకి సహకరించారు. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీటిని తీసుకెళ్లే సమయంలో రాష్ట్రం, కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నా అప్పడు ఎవ్వరూ మాట్లాడలేదు. ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే పది లక్షల ఎకరాలకు నీరు అందేది. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటి కంటే ఎక్కువ నిర్లక్ష్యం కేసీఆర్‌ హయాంలోనే జరిగింది’’అని సీఎం రేవంత్ అన్నారు.

Updated : 4 Feb 2024 10:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top