Home > తెలంగాణ > CM Revanth Reddy Davos Tour: దావోస్ చేరుకున్న సీఎం రేవంత్.. ఫొటోలు ట్రెండింగ్

CM Revanth Reddy Davos Tour: దావోస్ చేరుకున్న సీఎం రేవంత్.. ఫొటోలు ట్రెండింగ్

CM Revanth Reddy Davos Tour: దావోస్ చేరుకున్న సీఎం రేవంత్.. ఫొటోలు ట్రెండింగ్
X

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 54వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రి శ్రీధర్‌తో కలిసి సోమవారం ఢిల్లీ నుంచి బయల్దేరారు. భారత కాలమానం ప్రకారం నిన్న మధ్యాహ్నాం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకోగా.. అక్కడ పలువురు ప్రవాస భారతీయ ప్రముఖులు వారికి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం ఇచ్చి.. శాలువా కప్పి సన్మానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రవాస భారతీయులతో మాట్లాడటం చాలా సంతోషానిచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్రానికి సంబంధించిన పెవిలియన్​లో త్వరలో 'తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి' అనే ప్రచారం ప్రారంభిస్తామని సీఎం తెలిపారు.





జనవరి 15 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్న World Economic Forum (WEF) సదస్సులో తెలంగాణకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి WEF ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సోమవారం సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వివరాలను ఆయనకు వివరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో పాటు ఇతర ప్రముఖులను, నిర్వాహకులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులకు అవకాశాలపై ఆ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చర్చించారు.





తొలిసారి దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో ఆయన మాట్లాడుతారని తెలిపారు. చర్చాగోష్ఠిలో వైద్యరంగంపై తన అభిప్రాయాలను రేవంత్ రెడ్డి పంచుకుంటారని వెల్లడించారు. ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరిగే అత్యున్నతస్థాయి సదస్సులో పాల్గొని అగ్రి-ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం, రైతుల జీవనోపాధిని పరిరక్షించేందుకు వాతావరణానికి అనుగుణంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే అంశంపై రేవంత్ ప్రసంగిస్తారన్నారు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేసిన 'డెవలపింగ్ స్కిల్ ఫర్ ఏఐ'లో ప్రసంగిస్తారని తెలిపారు. టెక్ కంపెనీలతో పాటు ప్రవాస భారత పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుస్తారని తెలిపారు.
















Updated : 16 Jan 2024 1:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top