Home > తెలంగాణ > కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసింది.. సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసింది.. సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసింది.. సీఎం రేవంత్ రెడ్డి
X

చెరుకుతోటను అడవి పందులు ఆగం చేసినట్లు.. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసంగా మార్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్ల దుర్మార్గ పాలనలో తెలంగాణను విధ్వంసం చేశారని, కుటుంబ పాలనతో తెలంగాణను దోచుకున్నారన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లిలో జరిగిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో సీఎం మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి మట్టికి గొప్పతనం ఉందని, ఇక్కడ వేసే అడుగులో పోరాట పటిమ ఉందన్నారు. చరిత్ర పుటలో పౌరుషం గురించి చర్చించాలంటే రాంజీగోండ్‌ గురించి ప్రస్తావించాలన్నారు. రాంజీగోండ్‌ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నామన్నారు. ఆనాడు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం.. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటామని, ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.

పదేళ్ల పాలన లో కేసీఆర్ అడవిబిడ్డల గురించి ఆలోచించాడా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. భగీరథ పేరుతో రూ.40 వేల కోట్లు దోచుకొని అడవి బిడ్డలకు నీళ్లియ్యలేదన్నారు. గూడాలకు రోడ్లు వేయ్యలేదని , పదేళ్లు నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వలేదని , పదేళ్లలో రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాకముందే బీఆర్ఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికుందని సీఎం ప్రశ్నించారు. ఎవరైనా అలా మాట్లాడితే చెట్టుకు కట్టేసి కొట్టాలన్నారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమన్నారు. తమ ప్రభుత్వాన్ని పడగొడితే జనం చూస్తూ ఊరుకోరని అన్నారు.

"త్వరలోనే 15 వేల కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేస్తాం. త్వరలోనే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని ప్రారంభిస్తాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాలేదు.. బీఆర్ఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారు. కేసీఆర్‌ పదేళ్లలో ఏమీ చేయలేదు.. అలాంటిది మేం 2 నెలల్లోనే చేయడం సాధ్యపడుతుందా’’ అని ప్రశ్నించారు




Updated : 2 Feb 2024 12:42 PM GMT
Tags:    
Next Story
Share it
Top