హైదరాబాద్‌లో మరో భారీ నిర్మాణానికి రెడీ.. ట్విన్ టవర్స్‌కు త్వరలో..
X
కొత్త సెక్రటేరియట్, ప్రపంచంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం, రాష్ట్రం మొత్తంపై నిఘా పెట్టే భారీ పోలీస్ కంటోల్ కమాండ్ తరహాలో భాగ్యనగరంలో మరీ భారీ భవనం రూపుదిద్దుకోనుంది. సెక్రటేరియట్ దగ్గర్లో ట్విన్ టవర్స్ పేరుతో ఆకాశాన్నంటే రెండు భవనాలకు త్వరలో సీఎం కేసీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. స్థలం ఎంపికపై ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని, ఎన్నికల నగారా మోపే లోపే శ్రావణ మాసంలో పనులు మొదలుపెడతారని సమాచారం.
ఆయా ప్రభుత్వ శాఖల అధిపతు ఆఫీసుల కోసం ట్విన్ టవర్స్ నిర్మిస్తున్నారు. సచివాలయానికి ఇవి దగ్గర్లోనే ఉంటే పనులకు ఇబ్బంది ఉండదన్న సీఎం సలహాపై అధికారులు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. కొన్ని సమస్యలు ఉన్నా రెడ్ హిల్స్ ఉత్తమమని భావిస్తున్నట్లు వార్తు వస్తున్నాయి. సికింద్రాబాద్ పాటిగడ్డ, రెడ్ హిల్స్, ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను అధికారులు చుట్టివచ్చారు. పాటిగడ్డలో ప్రభుత్వానికి 40 ఎకరాల స్థలం ఉంది. అక్కడ టవర్లను కట్టి సంజీవయ్య పార్కు మీదుగా ఒక వంతెన నిర్మితే బేగంపేట, రసూల్ పురా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ఎమ్మెల్యే క్వార్టర్లలో కడితే స్కైవే నిర్మించాల్సి వస్తుంది. రిట్జ్ హోటల్, లోకాయుక్త భవనాల స్థానంలో కడితే చాలా స్థలం వస్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం హిమాయత్ నగర్లో కొత్త క్వార్టర్లను కట్టడతో ఆదర్శ్ నగర్ క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయి. పాటిగడ్డలోని పాత క్వార్టర్లు కూడా నిరుపయోగంగా పడుతున్నాయి. సచివాలయానికి ఏది దగ్గరగా, ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉండని చోట టవర్లు నిర్మించాలని సీఎం సూచిస్తున్నారు. కొత్త భవనాల నిర్మాణం కోసం అవసరమైతే విభాగాధిపతుల పాల భవనాలున అమ్మాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.