Breaking News : తెలంగాణ కాంగ్రెస్... ఎన్నికల కమిటీలను వేసేసింది..
X
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి దూసుకుపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా వేగం పెంచింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ కమిటీను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వీటికి ఆమోదం తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపుకు జాబితాలను వడబోస్తున్న పార్టీ హైకమాండ్ ఆదేశంతో త్వరలోనే రేపో మాపో పేర్లను ఖరారు చేసే అవకాశముంది.
ఎన్నికల నిర్వహణ కమిటీ
మాజీ డిప్యూసీ సీఎం దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన ఎన్నికల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో వంశీచంద్ రెడ్డి, ఫక్రుద్దీన్, ఇ. కొమ్రయ్య, జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.
మేనిఫెస్టో కమిటీ
దీనికి మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వం వహిస్తారు. కో చైర్మన్ మాజీ మంత్రిగి గడ్డం ప్రసాద్ కాగా, పొన్నాల లక్ష్మయ్య, బలరామ్ నాయక్, రవళి రెడ్డి, పోట్ల నాగేశ్వర్ రావు తదితరులు సభ్యులు.
ఇతర కమిటీలుs
సంపత్ కుమార్ నేతృత్వంలో చార్జ్ షీట్ కమిటీని వేశారు. కమ్యూనికేషన్ల కమిటీకి జెట్టి కుసుమ్ కుమార్ సారథ్యం వహిస్తారు. ట్రైనింగ్ కమిటీకి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యక్రమం అమలు కమిటీకి బలరామ్ నాయక్, ప్రచార కమిటీకి షబ్బీర్ అలీ, వ్యూహాల కమిటీకి ప్రేమ్ సాగర్ రావు నాయకత్వం వహిస్తారు.