Home > తెలంగాణ > కాంగ్రెస్ దూకుడు.. తెలంగాణ ఎన్నికల కమిటీ ఏర్పాటు

కాంగ్రెస్ దూకుడు.. తెలంగాణ ఎన్నికల కమిటీ ఏర్పాటు

కాంగ్రెస్ దూకుడు.. తెలంగాణ ఎన్నికల కమిటీ ఏర్పాటు
X

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో మినహా మిగితా చోట్ల సత్తా చాటలేకపోయింది. దీంతో ఈ సారి ప్రణాళికలకు మరింత పదును పెడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల ఎన్నికల కమిటీలను ప్రకటించింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికల కమిటీలను ప్రకటించింది.

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఛైర్మన్గా పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డిని నియమించింది. ఈ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి సహ 25 మందికి చోటు కల్పించింది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, జానారెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కి గౌడ్ సహా పలువురు ఉన్నారు. అదేవిధంగా ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులకు ఎక్స్ అఫిషియో మెంబర్స్‌గా అవకాశం కల్పించింది. ఇప్పటికే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీని సైతం ఏఐసీసీ ఏర్పాటు చేసింది. రాజస్థాన్ కాంగ్రెస్ నేత హరీష్ చౌదరీ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో స్క్రీనింగ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఎంపీ అభ్యర్థులపై హైకమాండ్కు నివేదిక ఇవ్వనుంది.

Updated : 6 Jan 2024 10:00 PM IST
Tags:    
Next Story
Share it
Top