విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నారు..
X
బీజేపీ నేత విజయశాంతి పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. తను బీజేపీని వీడడం లేదంటూ ఆమె ఎన్నిసార్లు మొత్తుకున్నా వదంతులు ఆగడం లేదు. రాములమ్మ త్వరలోనే తమ పార్టీలో చేరతారని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. విజయశాంతి నేడో, రేపో తమ పార్టీలోకి వస్తారని
శుక్రవారం మీడియాకు తెలిపారు. విజయశాంతి కొన్నాళ్లుగా బీజేపీకి కార్యక్రమాలకు దూరంగా ఉండడంతోపాటు స్వపక్ష నేతలపైనా విమర్శలు సంధిస్తున్నారు. తన పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదని చెబుతున్నారు. సోనియా గాంధీ అంటే తనకు వ్యక్తిగత అభిమానని చెప్పారు. దీంతో ఆమె త్వరలోనే మువ్వన్నెల జెండా కప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితర బీజేపీ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో రాములమ్మ కూడా వారి బాటలో నడుస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.Telangana congress leader mallu ravi says Bjp vijayashanti joining in their party