గవర్నర్‌ను కలిసిన టీ కాంగ్రెస్ నేతలు..
X
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ ఏర్పాటు కోసం లాంఛన కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. బుధవారం సీనీయర్ నేతల మల్లు రవి, మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశమయ్యారు. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలముందని, అందుకు అవకాశం కల్పించాలని కోరారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నామని తెలిపారు. మెజారిటీ ఉందంటూ 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఆమెకు అందజేశారు.
గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితర దిగ్గజాలు విచ్చేయనున్నారు. రేవంత్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఉప ముఖ్య మంత్ర పదవితోపాటు పలు కీలక పోస్టులను ఎవరి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం మంతనాలు జరుపుతోంది.