Home > తెలంగాణ > బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన కాంగ్రెస్.. రిజర్వేషన్లపై కీలక హామీలు..

బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన కాంగ్రెస్.. రిజర్వేషన్లపై కీలక హామీలు..

బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన కాంగ్రెస్.. రిజర్వేషన్లపై కీలక హామీలు..
X

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇప్పడికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన హస్తం పార్టీ ఇవాళ బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్ను విడుదల చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే దీనిని అమలుచేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 23 నుంచి 42శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది.

బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి 10లక్షల వరకు రుణాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వస్తే ప్రతి మండలంలో బీసీ గురుకులం, ప్రతి జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఐదేళ్లలో బీసీల అభ్యున్నతికి లక్ష కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చింది. నేత కార్మికులకు 50ఏళ్లు దాటగానే పెన్షన్ ఇస్తామని తెలిపింది. రాష్ట్రంలో మూడుచోట్ల మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పింది. బీసీల సంక్షేమానికి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

Updated : 10 Nov 2023 4:41 PM IST
Tags:    
Next Story
Share it
Top