Home > తెలంగాణ > వివిధ హోదాల్లో రిటైర్డ్ ఉద్యోగులు.. ప్రభుత్వ నిర్ణయంపై సస్పెన్స్

వివిధ హోదాల్లో రిటైర్డ్ ఉద్యోగులు.. ప్రభుత్వ నిర్ణయంపై సస్పెన్స్

వివిధ హోదాల్లో రిటైర్డ్ ఉద్యోగులు.. ప్రభుత్వ నిర్ణయంపై సస్పెన్స్
X

రిటైర్ అయినప్పటికీ వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పదవీ విరమణ చేసిన కొందరు అధికారులను కేసీఆర్ ప్రభుత్వం వివిధ స్థాయిల్లో నియమించింది. అయితే ఆయా శాఖల్లో పనిచేస్తోన్న విశ్రాంత ఉద్యోగుల వివరాలను ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. బుధవారం సాయంత్రం 5గంటలలోగా వివరాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.

రిటైర్డ్ IFS తిరుపతయ్య MCRHRDITలో సలహాదారుగా పనిచేస్తున్నారు. రిటైర్డ్ ఆఫీసర్ శివనాగిరెడ్డి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో బుద్ధభవన్ ప్రాజెక్ట్ను పర్యవేక్షిస్తున్నారు. మరో రిటైర్డ్ ఐఏఎస్ అరవింద సింగ్ ప్రోటోకాల్ అధికారిగా, రిటైర్డ్ అధికారి అనిల్ కుమార్ ఎండోమెంట్స్‌లో పనిచేస్తున్నారు. ఇక ఐఏఎస్ రాణి కుముదిని పదవిని రెండేళ్లు పొడిగించారు. రేవంత్ ప్రభుత్వం వీళ్ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

Updated : 16 Jan 2024 3:07 PM GMT
Tags:    
Next Story
Share it
Top