Home > తెలంగాణ > మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం.. తొలి సంతకం దేనిపైనంటే?

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం.. తొలి సంతకం దేనిపైనంటే?

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం.. తొలి సంతకం దేనిపైనంటే?
X

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయంలో మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. గురువారం ఉదయం 8:21 గంటలకు తన ఛాంబర్‌లో వేద పండితుల మంత్రోచ్ఛనాలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక, ఇందన, ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భట్టి.. మొదటగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రూ.298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండవ సంతకం చేశారు.

ఆపై విద్యుత్ సబ్సిడీ 996 కోట్ల రూపాయలు విడుదల ఫైలుపై సంతకం చేశారు. అలాగే సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కొరకు రూ.75 కోట్ల రూపాయలు వివిధ శాఖల మంజూరుకు సిఫారసు చేసిన ఫైలుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతకం చేశారు.బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎంకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రాన్స్ కోస్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, హరితలు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

ఇక తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధ్యతలను స్వీకరించారు. వేద పండితుల ఆశీర్వాదంతో శుభ ముహూర్తాన కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజల మధ్య ఆయన బాధ్యతలను చేపట్టారు.





Updated : 14 Dec 2023 4:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top