Home > తెలంగాణ > శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అధికారం చేపట్టిన అనంతరం తొలిసారి తిరుమలకు వెళ్లిన భట్టికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా.. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.

దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క.. రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని శ్రీవారిని కోరినట్లు చెప్పారు. డిసెంబర్ 28 కాంగ్రెస్ ఆవిర్బాభ దినోత్సవం సందర్భంగా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రకటిస్తామని చెప్పారు. రైతు భరోసా అమలు విధివిధానాలు త్వరలోనే ఖరారు చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Updated : 12 Dec 2023 1:16 PM IST
Tags:    
Next Story
Share it
Top