Home > తెలంగాణ > ప్రభుత్వ నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పని వేళల్లో మార్పు

ప్రభుత్వ నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పని వేళల్లో మార్పు

ప్రభుత్వ నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పని వేళల్లో మార్పు
X

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల వేళల్లో మార్పులు చేసింది. మంగళవారం (జులై 25) నుంచి పాఠశాలు నడిచే సమయాలు మారనున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఉదయం 9:30 గంటలకు స్కూళ్లను ప్రారంభించాలని తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు, సెకండరీ స్కూల్స్ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు పనిచేస్తాయి. హైదరాబాద్- సికింద్రాబాద్ పరిధిలోని స్కూల్స్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల వేళల్లో మార్పు వర్తిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేజేడీఎస్ లకు పంపించింది.



Updated : 24 July 2023 9:27 PM IST
Tags:    
Next Story
Share it
Top