Breaking News : భారీ వర్షాలు.. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
Mic Tv Desk | 25 July 2023 9:51 PM IST
X
X
వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, నదులు పొంగి ఊళ్లన్నీ జలమయం అయ్యాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ విద్యా శాఖ ముందస్తు జాగ్రత్తగా.. రేపు, ఎల్లుండి (జులై 26, 27)స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
బంగాళాఖాతంలో వాయవ్య ప్రాంతంలో మరో అల్ప పీడనం ఏర్పడింది. అది మరింత తీవ్రమై వాయుగుండంగా మారే అవకాశముంది. దీంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున అవసరం అయితేనే బయటకు రావాలని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
Updated : 25 July 2023 9:57 PM IST
Tags: telanagna Education Department holidays for schools and colleges heavy rains weather report rain alert
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire