Home > తెలంగాణ > టీఆర్టీ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

టీఆర్టీ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

టీఆర్టీ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?
X

తెలంగాణలో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కు దరఖాస్తు గడువును పొడిగించారు. ఇవాళ్టితో దరఖాస్తు గడువు ముగియగా.. ఈ నెల 28వరకు పొడిగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటి వరకు 1.38లక్షల మంది ఫీజు చెల్లించగా.. వారిలో 1.33 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నవంబర్ 20 నుంచి 30 మధ్య జరగాల్సిన ఈ ఎగ్జామ్ ను విద్యాశాఖ వాయిదా వేసింది. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో డీఎస్సీని వాయిదా వేసింది.

మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సర్కార్ సెప్టెంబరు 7న నోటిఫికేషన్‌‎ను రిలీజ్ చేసింది. ఇందులో ఎస్‌జీటీ - 2,575 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ - 611, స్కూల్‌ అసిస్టెంట్‌ -1,739, పీఈటీ - 164 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ డీఎస్సీ ద్వారానే ఈ భర్తీ చేయనుంది సర్కార్. అత్యధికంగా హైదరాబాద్​ జిల్లాలో 358 , నిజామాబాద్​ జిల్లాలో 309 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అతి తక్కువగా పెద్దపల్లి జిల్లాలో 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి.


Updated : 20 Oct 2023 1:45 PM GMT
Tags:    
Next Story
Share it
Top