Home > తెలంగాణ > 9 గంటల వరకు 8.52 శాతం పోలింగ్‌

9 గంటల వరకు 8.52 శాతం పోలింగ్‌

9 గంటల వరకు 8.52 శాతం పోలింగ్‌
X

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ప్రజలు ఓటు వేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 8.52 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. వివిధ నియోజక వర్గాల పరిధిలో పోలింగ్‌ సరళిని గమనిస్తే ఇబ్రహీంపట్నంలో 8.11%, కొత్తగూడెంలో 8.33%, వేములవాడలో 9.80%, సిరిసిల్లలో 10.71%, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో 5.10 %, మంథనిలో 8.20%, కూకట్‌పల్లిలో 5.43 %, కోదాడలో 10.76%, కోరుట్లలో 11.83 % పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం. ఇక రంగారెడ్డి జిల్లాలో ఉదయం 9 గంటల వరకు నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ శాతాన్ని గమనిస్తే ఇబ్రహీంపట్నంలో 8.11%, ఎల్బీనగర్‌ లో 5.6%, మహేశ్వరంలో 5%, రాజేంద్రనగర్‌ లో 15%, శేరిలింగంపల్లిలో 8%,చేవెళ్ల లో 5%, కల్వకుర్తిలో 5%, షాద్‌నగర్‌ లో 7.2% పోలింగ్ నమోదు అయ్యింది.

ఇక పోలింగ్ బూత్‎ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే రాష్ట్రంలో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇబ్రహీంపట్నం ఖానాపూర్‌లో రెండు పార్టీలకు చెందిన సపోర్టర్స్ ఘర్షణకు దిగారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వారిపై లాఠీఛార్జ్‌ చేసి చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మరోవైపు భద్రాద్రి జిల్లాలోని నల్లబండబోడుకు తారు రోడ్డు వేయలేదని అక్కడి గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు. ఓటు వేయకుండా గ్రామస్థులు నిరసన చేపట్టారు. జనగామలోని 245వ పోలింగ్ బూద్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌, సీపీఐ, బీజేపీ కార్యకర్తలు,బీఆర్ఎస్‎కు మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Updated : 30 Nov 2023 5:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top