Home > తెలంగాణ > రేపు తెలంగాణ ఎలక్షన్ నోటిఫికేషన్.. నామినేషన్ల ప్రక్రియ షురూ

రేపు తెలంగాణ ఎలక్షన్ నోటిఫికేషన్.. నామినేషన్ల ప్రక్రియ షురూ

రేపు తెలంగాణ ఎలక్షన్ నోటిఫికేషన్.. నామినేషన్ల ప్రక్రియ షురూ
X

అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరలేవనుంది. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ నియోజకవర్గాలవారీగా ఆర్‌ఓ ఆఫీసులను ఏర్పాటు చేసింది. శుక్రవారం ఈసీ ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్థానిక ఆర్ఓ ఆఫీసులో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పనిదినాల్లో ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులు శుక్రవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన జరగనుంది. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు నవంబర్ 15లోపు నామినేషన్లు విత్ డ్రా చేసుకోవచ్చు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీఆర్ఎస్ పార్టీ దూకుడు మీద ఉంది. ఎన్నికలకు రెండు నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత వారికి బీఫామ్‌లు సైతం అందజేసింది. ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీ ఇంకా కొన్ని చోట్ల అభ్యర్థులను ఖరారు చేయలేదు.


Updated : 2 Nov 2023 7:33 PM IST
Tags:    
Next Story
Share it
Top