Home > తెలంగాణ > గ్రేటర్ హైదరాబాద్‎ గులాబీమయం..అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ హవా

గ్రేటర్ హైదరాబాద్‎ గులాబీమయం..అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ హవా

గ్రేటర్ హైదరాబాద్‎ గులాబీమయం..అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ హవా
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను గమనిస్తే హైదరాబాద్‎లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎంఐఎం నాలుగు చోట్లు ముందంజలో ఉండగా కాంగ్రెస్ మూడు స్థానాల్లో, బీజేపీ ఒకచోట ఆధిక్యంలో ఉంది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే గ్రేటర్ హైదరాబాద్‎లోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. భాగ్యనగరంలో అతి తక్కువ ఓటింగ్ నమోదు అయినప్పటికీ ప్రజలు అభివృద్ధి పట్ల ఆకర్షితులయ్యారనే చెప్పాలి. అయితే బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ ఎలక్షన్లలో తమ ప్రభావాన్ని చూపించలేకపోయాయి. ప్రస్తుత కౌంటింగ్ సరళిని గమనిస్తే హైదరాబాద్ గులాబీమయంగా కనిపిస్తోంది.


ఆధిక్యంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు :

శేరిలింగంపల్లి : అరికెపూడి గాంధీ

కూకట్‏పల్లి : మాధవరం కృష్ణారావు

సనత్ నగర్ : తలసాని శ్రీనివాస్ యాదవ్

కుత్బుల్లాపూర్ : కేపీ వివేకానంద్

ముషీరాబాద్ : ముఠాగోపాల్

జూబ్లీహిల్స్ : మాగంటి గోపీనాథ్

కంటోన్మెంట్ : లాస్య నందిత

సికింద్రాబాద్ : పద్మారావు

ఉప్పల్ : లక్ష్మారెడ్డి

గోషామహల్ : నందకిశోర్ వ్యాస్ బిలాల్

ఖైరతాబాద్ : దానం నాగేందర్

ఎల్బీనగర్ : దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

మేడ్చల్ : చామకూర మల్లారెడ్డి

మల్కాజిగిరి : రాజశేఖర్ రెడ్డి

ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు :

నాంపల్లి : ఫిరోజ్ ఖాన్

పటాన్‎చెరు : కాట శ్రీనివాస్ గౌడ్

ఇబ్రహీంపట్నం : మల్‎రెడ్డి రంగారెడ్డి

ఆధిక్యంలో ఉన్న ఎంఐఎం అభ్యర్థులు :

కార్వాన్ : కౌసర్ మొహియుద్దీన్

చాంద్రాయణగుట్ట : అక్బరుద్దీన్ ఓవైసీ

మలక్‎పేట్ : అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా

చార్మినార్ : మీర్ జుల్ఫీకర్ అలీ

ఇక బీజేపీ అభ్యర్థి వీరేంద్రయాదవ్ యాకుత్‎పురాలో ఆధిక్యంలో ఉన్నారు.

Updated : 3 Dec 2023 6:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top