మందుబాబులకు అలర్ట్.. రూల్స్ మారాయ్..
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. పోలింగ్ కు మరో 10 రోజులే టైమ్ ఉండటంతో.. అధికారులు కొత్త రూల్స్ తెచ్చారు. హైదరాబాద్‌లో బార్లు, పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపార వేళల మార్పులు చేస్తూ.. హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య కొత్త ఉత్తర్వులు జారీ చేశారు.నిర్ణయించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు సాధారణ సమయాన్ని ఇచ్చిన అధికారులు.. వీకెండ్‌లో మాత్రం గంట సమయాన్ని అదనంగా ఇచ్చారు.
సాధారణ రోజుల్లో హోటళ్లు, రెస్టారెంట్లను ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతిచ్చారు. బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు పబ్‌లకు ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు అనుమతి ఇచ్చారు. అయితే.. వీకెండ్ రోజుల్లో మాత్రం బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు పబ్‌లకు అదనంగా మరో గంట అంటే ఒంటి గంట వరకు పర్మిషన్ ఇచ్చారు. అయితే.. దుకాణాలకు మాత్రం అన్ని రోజుల్లోనూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి ఇచ్చారు. అయితే.. తాము నిర్ణయించిన సమయానికి దుకాణాలు రెస్టారెంట్లు, పబ్బులు తెరిచినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.