Home > తెలంగాణ > రీల్ పెట్టు..అవార్డు పట్టు..తెలంగాణ సర్కార్ అదిరే ఆఫర్

రీల్ పెట్టు..అవార్డు పట్టు..తెలంగాణ సర్కార్ అదిరే ఆఫర్

రీల్ పెట్టు..అవార్డు పట్టు..తెలంగాణ సర్కార్ అదిరే ఆఫర్
X

సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్‎కు తెలంగాణ సర్కార్ అదిరిపోయే ఆఫర్‎ను అందించింది. తమ వ్యక్తిగత ఛానెల్స్‎లో రీల్స్, వీడియోలు చేసే అలవాటు ఉన్న వారికి అవార్డులను అందించేందుకు రెడీ అయ్యింది రాష్ట్ర అటవీ శాఖ . అయితే వారు చేసే వీడియోలు మాత్రం పచ్చదనంతో నిండిపోవాలనే కండీషన్‎ను పెట్టింది.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎంత పవర్‎ఫుల్‎గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నార్మల్ పీపుల్ నుంచి సెలబ్రిటీల వరకు ఆఖరికి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు చేరువవుతున్నారు. ప్రపంచ నలుమూలల్లో ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో నెట్టింట్లో ప్రత్యక్షమవుతోంది. నిమిషాల్లో వైరల్ అవుతోంది.

ఇదే క్రమంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 19వ తెలంగాణ సర్కార్ పెద్ద ఎత్తున హరితోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజున భారీ సంఖ్యలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అందుకే ఈ సోషల్ మీడియా ద్వారా పచ్చదనం ప్రాముఖ్యతను , హరితహారాన్ని మరింతగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా కంటెట్ క్రియేటర్లకు అవార్డులు అందించాలని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. హరితహారం, పచ్చదనం, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, మొక్కల గురించి ప్రత్యేకతను, ప్రాముఖ్యతను వివరిస్తూ క్రియేటివ్‎గా వీడియోలు చేసిన వారిలో ది బెస్ట్‎ను సెలెక్ట్ చేసి అవార్డులు అందించనున్నారు అధికారులు. వీడియోలు , రీల్స్ చేసేవారు నిమిషం పాటు డ్యూరేషన్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ వీడియోలను tkhh2023@gmail.com అనే మెయిల్‏కు పంపిస్తే సరిపోతుంది.

Updated : 15 Jun 2023 12:16 PM IST
Tags:    
Next Story
Share it
Top