Home > తెలంగాణ > రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. సిరిసిల్లలో కేటీఆర్.. సిద్ధిపేటలో హరీష్‌రావు

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. సిరిసిల్లలో కేటీఆర్.. సిద్ధిపేటలో హరీష్‌రావు

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. సిరిసిల్లలో కేటీఆర్.. సిద్ధిపేటలో హరీష్‌రావు
X

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి కేటీఆర్‌ (Minister KTR) జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇక సిద్దిపేట జిల్లాలో కలెక్టరేట్‌లో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి హరీశ్‌ రావు (Minister Harish rao) పాల్గొన్నారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.



అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని చెప్పారు. గతంలో చెరువులు ఎండిపోయి ఉండేవని.. ఇప్పుడు నిండుగా మండుటెండల్లోనూ నిండుగా ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం యుద్ధాలు జరిగేవని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. అంతకుముందు సిద్దిపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. రంగదాంపల్లిలో అమరవీరుల స్థూపం వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు. ముస్తాబాద్‌ సర్కిల్‌లోని ప్రొఫెసర్ జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.




మెదక్ కలెక్టరేట్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ , సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌ రెడ్డి, నిజామాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి మహమూద్‌ అలీ, మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌, నిర్మల్‌ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌‌, జనగామ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్థూపానికి, కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.






Updated : 2 Jun 2023 10:22 AM IST
Tags:    
Next Story
Share it
Top