Home > తెలంగాణ > దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ ప్రగతిని చాటుదాం.. సీఎం కేసీఆర్

దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ ప్రగతిని చాటుదాం.. సీఎం కేసీఆర్

దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ ప్రగతిని చాటుదాం.. సీఎం కేసీఆర్
X

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR). శుక్రవారం ఉదయం 10:30 గం.ల సమయంలో సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు . అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ముందుగా ప్రజలకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. రాష్ట్ర పోరాట చరిత్ర, అభివృద్ధి ప్రస్థానాన్ని తలచుకుందామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైందని, 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని చెప్పారు. మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందన్న కేసీఆర్‌... మలి దశ ఉద్యమంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయని చెప్పారు. రాష్ట్ర అవతరణ తర్వాత అభివృద్ధి ప్రయాణం మొదలైందని, అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ ప్రగతిని చాటుదామని , రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు నివాళులు తెలిపారు.




ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నా

"2014 జూన్ 2న సీఎంగా నేనొక వాగ్దానం చేశా.. రాష్ట్రాన్ని చూసి దేశం నేర్చుకునేలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చా.. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నా..కరోనా వల్ల తొమ్మిదేళ్లలో మూడేళ్లు వృధాగా పోయాయి.. మిగిలిన ఆరేళ్లలోనే రాష్ట్రం ప్రగతి శిఖరాలు అధిరోహించింది" అని కేసీఆర్‌ అన్నారు.

ఎద్దేవా చేశారు, శాపానార్థాలు పెట్టారు

అనంతరం 9 ఏండ్ల పాలనలో తెలంగాణ సాధించిన విజయాలను సీఎం తెలిపారు. శుద్ధి చేసిన తాగునీరు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం.. తెలంగాణ అని చెప్పారు. తాగునీరు అంశంలో రాష్ట్రానిది దేశంలోనే ప్రథమస్థానమన్నారు. మిషన్ భగీరథకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని.. నేడు రాష్ట్రంలో ఫ్లోరైడ్ బాధలు లేవని కేంద్రమే ఒప్పుకుందన్నారు. తెలంగాణ వస్తే అంధకారమేనని గతంలో పాలకులు ఎద్దేవా చేశారని, శాపానార్థాలు పెట్టారన్నారు. విద్యుత్తు అంశంలో విప్లవాత్మక విజయాలు సాధించామని, సాగుకు నిరంతర ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ మారిందని చెప్పారు.

సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం

రాష్ట్ర పథకాల పట్ల దేశమంతటా ఆదరణ కనిపిస్తోందని తెలిపిన సీఎం.. సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం అనేదే తమ నినాదమని చెప్పారు. సంక్షేమంలో రాష్ట్రం స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించిందని, తలసరి ఆదాయంలో 155 శాతం వృద్ధితో పెద్ద రాష్ట్రాలను దాటామన్నారు. ఎత్తిపోతల పథకాలతో బీడుభూములన్నీ సస్యశ్యామలయ్యాయని తెలిపారు కేసీఆర్. తాగునీటి కష్టాలకు మిషన్ భగీరథ చరమగీతం పాడిందని తెలిపారు. మన పల్లెలకు జాతీయస్థాయి అవార్డులు వస్తున్నాయని.. మన నగరాలు.. ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నాయని చెప్పారు. అనేక రంగాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలుస్తోందన్నారు. ఆరేళ్లలోనే రాష్ట్రం ప్రగతి శిఖరాలు అధిరోహించిందన్నారు.

పోడు భూములకూ రైతుబంధు పథకం

నేటి నుంచి 21 రోజులపాటు దశాబ్ధి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు కేసీఆర్. రాష్ట్రం ఏర్పడిన రోజు ఏ రంగంలో చూసినా విధ్వంసమేనని.. అస్పష్టతలు, అవరోధాలు అధిగమిస్తూ పురోగమిస్తున్నామని తెలిపారు. దేశంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా తెలంగాణ ఎదిగిందన్నారు. తెలంగాణ దృక్పథంతో విధానాల రూపకల్పన జరిగిందనన్నారు. దశాబ్ది ఉత్సవాల్లోనే రెండోవిడత గొర్రెల పంపిణీ ప్రారంభమవుతుందని కేసీఆర్‌ తెలిపారు. దశాబ్ది వేడుకల వేళ పోడు భూములకు పట్టాలు ఇస్తామని, పోడు భూములకూ రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో 24 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.






Updated : 2 Jun 2023 5:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top