Home > తెలంగాణ > గోల్కొండ కోటలో సంబరాలు షురూ...జెండా ఎగురవేసిన కిషన్ రెడ్డి

గోల్కొండ కోటలో సంబరాలు షురూ...జెండా ఎగురవేసిన కిషన్ రెడ్డి

గోల్కొండ కోటలో సంబరాలు షురూ...జెండా ఎగురవేసిన కిషన్ రెడ్డి
X

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటలో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కోటలో ఆవిర్భావ వేడుకలను కేంద్ర సర్కార్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోటపై జాతీయ జెండాను ఎగురవేసి సంబరాలను షురూ చేశారు. పోలీసుల నుంచి గైరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు . తెలంగాణ కోసం అమరులైన వారిని ఈ సందర్భంగా స్మరించుకుందామని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సకలజనులు పోరాడితేనే రాష్ట్రం ఏర్పడిందని , కేవలం ఒక్కరిద్దరి వల్లే రాష్ట్రం రాలేదని అన్నారు మంత్రి. బీజేపీ మద్దతుతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, అందరం సుష్మాస్వరాజ్‎కు నివాళులర్పిద్దాం అని తెలిపారు.

ఈ వేడుకల్లో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.." తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాము. సకల జనులందరూ కలిసికట్టుగా పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం స్వప్నం సాకారమైంది. తెలంగాణ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన 1200 మంది అమరవీరులకు స్మరించుకుందాం. రాష్ట్ర సాధనలో బీజేపీ తెలంగాణ గుండెచప్పుడయ్యింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీ పార్లమెంటులో విశ్రమించకుండా పోరాటం చేశారు సుష్మా స్వరాజ్‌. ఈ సందర్భంగా ఆమెకు మనం నివాళులు అర్పిద్దాం. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ దగాకోరుల పాలవుతోంది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది" అని మండిపడ్డారు కిషన్ రెడ్డి.

దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా దేశ ప్రధాని మోదీ తొమ్మిదేళ్ళ పాలనకు సంభందించి పోటో ఎగ్జిబిషన్‌ను గోల్కొండ కోటలో ఏర్పాటు చేశారు. ఉదయం ప్రారంభమైన రాష్ట్ర అవతరణ వేడుకలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. భారత సాంస్కృతిక వైభవంతో పాటు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై రెండు సినిమాలను ప్రదర్శించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది.

Updated : 2 Jun 2023 8:09 AM IST
Tags:    
Next Story
Share it
Top