ప్రమాదస్థలికి కేటీఆర్.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా..
X
నాంపల్లి అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పింది. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేసింది. గాయపడినవారి వైద్యానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
అంతకుముందు ప్రమాద స్థలాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా కృషి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోందని వారందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
#WATCH | Telangana Minister KT Rama Rao visits apartment complex godown fire site in Hyderabad's Nampally pic.twitter.com/kJP5DVgHpG
— ANI (@ANI) November 13, 2023