Home > తెలంగాణ > స్కూళ్లకు వేసవి సెలవుల పొడిగింపుపై క్లారిటీ..

స్కూళ్లకు వేసవి సెలవుల పొడిగింపుపై క్లారిటీ..

స్కూళ్లకు వేసవి సెలవుల పొడిగింపుపై క్లారిటీ..
X

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా స్కూళ్లకు ఇచ్చిన వేసవి సెలవులను పొడిగిస్తారనే వార్తలు వస్తున్నాయి. దీంతో సమ్మర్ హాలిడేస్ పొడిగింపుపై తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో జూన్ 12 నుంచే పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. సెలవులను పెంచే ఉద్దేశం లేదని..యథావిధిగా పాఠశాలలు తెరుచుకుంటాయని తెలిపింది.

మరోవైపు ఏపీ సర్కార్ మాత్రం స్కూల్స్ రీ ఓపెనింగ్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఎండలు అధికంగా ఉండడంతో సెలవులను పొడిగించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జగన్ సర్కార్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆంద్రప్రదేశ్ లో కూడా జూన్ 12నే పాఠశాలలు తెరుచుకోనున్నట్టు సమాచారం.

ఉష్ణోగ్రతలు రోజురోజుకూ అధికమవుతుండటంతో తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి 6-10 తరగతులకు, జూన్ 5వ తేదీ నుంచి 1-5 తరగతులకు స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎండలు తగ్గుముఖం పట్టకపోవడంతో జూన్ 6వ తేదీన తరగతులు నిర్వహించాలని భావించారు. అప్పటికీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఈ నెల 11వ తేదీ వరకు వేసవి సెలవులను పొడగించారు. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ 6-10 తరగతులకు, ఇంటర్ విద్యార్ధులకు జూన్ 12, 1-5 తరగతులకు జూన్ 14న క్లాసులు ప్రారంభమవుతాయి.

Updated : 9 Jun 2023 8:07 PM IST
Tags:    
Next Story
Share it
Top