Home > తెలంగాణ > Sankranti Festival : విద్యార్థుకులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Sankranti Festival : విద్యార్థుకులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Sankranti Festival : విద్యార్థుకులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
X

సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవుల్ని ప్రకటించింది. జనవరి 12 నుంచి 17 వరకు మొత్తం 6 రోజులు సంక్రాంతి సెలవుల్ని ప్రకటించింది. ఈ సెలవుల్లో జనవరి 13 న రెండో శనివారం సెలవు కూడా కలిసిపోయింది. జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ పండుగలతో పాటు అదనంగా జనవరి 17న సెలవు ఉంది. మిషనరీ స్కూళ్లకు మినహాయించి మిగతా అన్ని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

కళాశాలలకు ఎప్పుడు సెలవులు ఉంటాయన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ సెలవులతో పాటు జనవరిలో 26న రిపబ్లిక్ డే సందర్భంగా సెలవు ఉంది. జనవరి 7, 14, 21, 28 ఆదివారం సందర్భంగా సెలవులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులపై క్లారిటీ ఇవ్వడంతో మళ్లీ పండుగ హడావుడి కనిపించనుంది. బస్సులు, రైళ్లల్లో రద్దీ పెరగనుంది. ఇప్పటికే సెలవులకు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసున్నారు ప్రజలు. తెలంగాణ ప్రభుత్వం సూళ్లకు ఇచ్చే సెలవుల విషయమై క్లారిటీ ఇవ్వటంతో సంకాంత్రి పండగకు సొంతూళ్లకు వెళ్లేవాళ్లు సిద్ధమవుతున్నారు. దీంతో బస్సులు, రైళ్లలో రద్దీ పెరగనుంది.




Updated : 3 Jan 2024 2:37 PM IST
Tags:    
Next Story
Share it
Top