Home > తెలంగాణ > రాష్ట్రంలో 5 కొత్త ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు..మొత్తం ఎన్నంటే..

రాష్ట్రంలో 5 కొత్త ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు..మొత్తం ఎన్నంటే..

రాష్ట్రంలో 5 కొత్త ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు..మొత్తం ఎన్నంటే..
X

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 5 కొత్త ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. అన్ని ప్రధాన కోర్సులతో వీటిని 2023-24 విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించనున్నారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లా మద్నూరు, భదాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం డిగ్రీ కళాశాలల సంఖ్య 136కు చేరుకుంది. వీటిలో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉంటుంది. గత మూడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేసింది. వీటిలొ నల్గొండ జిల్లాలోని ఆలియా, మహేశ్వరం, వికారాబాద్‌, పరిగి, రాజేంద్రనగర్‌, కుత్బుల్లాపూర్‌, ధన్వాడ, మక్తల్‌, బడంగ్‌పేట్ ఉన్నాయి. కొత్త కాలేజీల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ లైఫ్‌సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్స్‌ కోర్సులు ఉంటాయి. ఒక్కో కాలేజీలో 240 మంది విద్యార్థులను చేర్చుకంటారు.





బధిరుల డిగ్రీ కాలేజీకి కసరత్తు

బధిరుల కోసం ప్రత్యేకంగా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఖైరతాబాద్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ రాజేందర్ మంగళవారం రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డితో సమావేశమై చర్చలు జరిపారు. బధిరుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని, డిగ్రీ కాలేజీ ఏర్పాటు సీఎం కేసీఆర్ అనుమతివ్వడంతో త్వరలోనే సాకారమవుతుందని వాసుదేవరెడ్డి చెప్పారు.


Updated : 8 Aug 2023 10:47 PM IST
Tags:    
Next Story
Share it
Top