Home > తెలంగాణ > టెట్ నిర్వహణకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

టెట్ నిర్వహణకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

టెట్ నిర్వహణకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్
X

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అదనంగా మరో 3 లక్షల మంది డీఎస్సీ రాసుకునే అవకాశం ఉంది.టెట్ పరీక్ష నిర్వహించాలని టెట్ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరీక్షలపై మంత్రి రాజనర్సింహ అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఈరోజు భేటీ అయినా సబ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 11,062 టీచర్లు పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నిన్న పాత నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 11,062 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), 2,629 స్కూల్ అసిస్టెంట్లు (SA), 727 లాంగ్వేజ్ పండిట్లు 182 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ , 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 220 పోస్టులు, 79 SA క్యాడర్ కింద ఖాళీలు ఉంటాయి. ఈ పోస్టులలో గత బీఆర్‌ఎస్‌ (BRS) ప్రభుత్వం నోటిఫై చేసిన 5,089 ఖాళీలు కూడా ఉన్నాయి.

Updated : 14 March 2024 1:49 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top