Home > తెలంగాణ > ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్

ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్

ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్
X

ఆశావర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. జూలై నుంచి ఆశావర్కర్లలకు ఇచ్చిన సెల్ ఫోన్ బిల్లులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశంలో అత్యధిక వేతనం ఆశలకు తెలంగాణలోనే ఇస్తున్నామన్నారు. ఆశ వర్కర్స్ అవగాహన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. పేదలకు ఉత్తమ సేవలు అందించడంలో కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలన్నారు. వైద్య ఆరోగ్యంలో రాష్ట్రం ఏర్పాడ్డాక 14వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వచ్చామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 శాతం డెలివరీలు జరుగుతున్నాయని వివరించారు. న్యూట్రిషన్ కిట్ ద్వారా గర్భంతో ఉన్న మహిళలకు బలవర్ధక ఆహారం అందిస్తున్నామన్నారు.

గర్భిణుల కోసం 3 కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. గాంధీలో ఒక వారంలో సూపర్ స్పెషలిటీ ఎంసీహెచ్ ఆసుపత్రి ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో మతా మరణాల సంఖ్య తగ్గిందన్నారు. నాలుగు టైమ్స్ ఆసుపత్రులు త్వరలో అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. నిమ్స్ లో రోబోటిక్ యంత్రం అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిమ్స్ వైద్యుల సేవలను హరీష్ రావు కొనియాడారు.

ఆశా వర్కర్స్ అవగాహన కార్యక్రమంలో భాగంలో విపక్షాలపై హరీష్ రావు మండిపడ్డారు. ప్రతిపక్షంలోని వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఆశ వర్కర్స్‌ని చాల ఇబ్బంది పెట్టాయని ఆరోపించారు. వేతనం పెంచమనీ అడిగితే గుర్రాలతో తొక్కించారన్నారు. అర్ధరాత్రి ఆశా వర్కర్ లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంచిన చరిత్ర కాంగ్రెస్‎ది అని విరుచుకుపడ్డారు.


Updated : 7 July 2023 4:53 PM IST
Tags:    
Next Story
Share it
Top