Home > తెలంగాణ > IAS అధికారి అరవింద్‌ కుమార్‌కు రేవంత్ సర్కార్ షాక్

IAS అధికారి అరవింద్‌ కుమార్‌కు రేవంత్ సర్కార్ షాక్

IAS అధికారి అరవింద్‌ కుమార్‌కు రేవంత్ సర్కార్ షాక్
X

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారుల అక్రమాలపై సీఎం రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ప్రభుత్వం షాకిచ్చింది. తెలంగాణ కేబినెట్ ఆమోదం లేకుండా ఫార్ములా ఈ-రేస్( కారు రేస్‌)కు రూ. 54 కోట్లు కేటాయించడంపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న అరవింద్ కుమార్‌... గత ప్రభుత్వంలో మున్సిపల్, HMDA కమిషనర్‌గా పనిచేశారు. బీహర్ క్యాడర్ అధికారి అరవింద్ కు తెలంగాణ ప్రభుత్వం మోమో జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

మంత్రివర్గం, ఆర్థికశాఖ అనుమతులు లేకుండానే హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు HMDA ఒప్పందం కుదుర్చుకుంది. దాని నిర్వహణ కోసం ముందస్తుగానే రూ. 54 కోట్లు చెల్లించింది. ముందస్తు నోటీసులేవీ ఇవ్వకుండానే ఒప్పందాన్ని అతిక్రమించి రేసును రద్దు చేసినందుకు మున్సిపల్ శాఖకు లీగల్ నోటీసులు ఇస్తామంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

కార్ రేసింగ్ కు... ట్రాక్‌, రేసింగ్‌ నిర్వహణ, ఇతర ఏర్పాట్లు, మార్కెటింగ్‌, వివిధ దేశాల రేసర్లకు సౌకర్యాల కల్పన అన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు రూ.200 కోట్లు అవుతుందని అప్పట్లో అంచనా వేశారు. దీనికోసం హెచ్‌ఎండీఏ గత సర్కారు ఆదేశాలతో ఓ నిర్మాణ సంస్థకు రూ.50 కోట్ల వరకు చెల్లించింది. గత ప్రభుత్వం చెల్లించినది పోగా.. ఫార్ములా రేస్‌ నిర్వహణకు రూ.146 కోట్లను ప్రస్తుత సర్కారు భరించాల్సి ఉంటుంది. ప్రజాధనంతోనే ఈ రేస్ నిర్వహించబోతున్నారనే విమర్శలు సైతం వ్యక్తమయ్యాయి.

Updated : 9 Jan 2024 10:39 AM IST
Tags:    
Next Story
Share it
Top