చెట్లను కొడితే ఇక గట్టిగా అరుస్తయ్.. తెలంగాణలో కొత్త టక్నాలజీ
X
మనదేశంలోని విలువైన అటవీ సంపద రాష్ట్రాల సరిహద్దులనే కాదు దేశం హద్దులనూ దాటిపోతోంది. స్మగ్లింగ్‌ను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. నిఘా, అరెస్టులు, దాడులు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. ఎర్రచందనం, గంధం, టేకు చెట్ల నరికివేత గురించి చెప్పాల్సిన పనేలేదు. కొన్నిసార్లు దొంగలే పైచేయి సాధించి అటవీ సిబ్బంది చంపిమరీ దుంగలను ఎత్తుకెళ్తున్నారు. అత్యంత పడక్బందీ భద్రత ఉండే హైదరాబాద్ నెహ్రూ జూలోని గంధం చెట్లనే నరికి దర్జాగా గోడలు దాటించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చెట్ల పరిరక్షణ కోసం కొత్త టెక్నాలజీని అమల్లోకి తీసుకొచ్చింది. విలువైన చెట్లకు ఎలక్ట్రానిక్ చిప్స్ పెడుతోంది. గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్‌లో శనివారం వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. రియల్ టైమ్ ప్రొటెక్షన్ విధానంలో పనిచేసే పరికరాన్ని చెట్లకు అతికించి వాటిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. 'ఈ- ప్రొటెక్షన్ సిస్టం'’ పేరుతో సీబీఐఓటీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సెన్సర్ చిప్స్ లను తయారు చేసింది. చెట్లను ఎవరైనా కొడితే ఎలక్ట్రానిక్ చిప్‌లోని సైరన్ గట్టిగా అరుస్తుంది. దాన్నుంచి మొబైల్ అప్లికేషన్‌కు సమాచారం అందుతుంది. దీంతో అధికారులు వెంటనే అక్కడికి వెళ్లి నేరస్తును పట్టుకునే వీలు ఉంటుంది. బొటానికల్ గార్డెన్లో 50 చెట్లకు వీటిని అమర్చారు.