తెలంగాణలో వాహనాల నంబర్ ప్లేట్లు మార్పు..!
X
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాలు, ఆరు గ్యారెంటీల అమలు సహా పలు అంశాలపై చర్చించనుంది. అయితే రాష్ట్రంలో వాహనాల నెంబర్ ప్లేట్స్ మార్చాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తతం వాహనాలకు TS అని ఉంది. దానిని TGగా మార్చాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆదివారం నాటి మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలపనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడైనా TG అనే రాశారు. పలువురు తమ వాహనాలకు TG అని రాసుకున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక TG అనే ఉంటుందుని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ సర్కార్ TGని పక్కనబెట్టి TS (state of telangana)ను తెరపైకి తీసుకొచ్చింది. దీనిపై చాలా మంది పెదవి విరిచారు. అప్పటి నుంచే TG పెట్టాలనే డిమాండ్లు వినిపించాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరడంతో ఆ దిశగా అడుగుతు పడుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.