Home > తెలంగాణ > తెలంగాణ ప్రభుత్వానికి.. హైకోర్టులో చుక్కెదురు

తెలంగాణ ప్రభుత్వానికి.. హైకోర్టులో చుక్కెదురు

తెలంగాణ ప్రభుత్వానికి.. హైకోర్టులో చుక్కెదురు
X

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పునిచ్చింది. ఇద్దరి ఎమ్మెల్సీల నియమకాలపై ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ హైకొర్టు కొట్టి వేసింది. గతంలో కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను కోర్టు తిరస్కరించింది. అలాగే ఎమ్మెల్సీల నియామకంపై సర్కార్ పునర్ సమీక్షించుకోవాలన్న హైకోర్టు మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని సూచించింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎన్నుకుంది. కానీ వారికి రాజకీయంగా అనుబంధం ఉందంటూ గవర్నర్ ప్రభుత్వ వినతిని తోసిపుచ్చింది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత కోదండరామ్, అమిర్ అలీఖాన్‌ను గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నియమించారు. దీనిపై దాసోజు శ్రావన్, కుర్రా సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు.

ప్రొఫెసర్ కోందడరామ్ ఓ రాజకీయ పార్టీ అధినేతగా ఉండి ఆయనను ఎలా ఎమ్మెల్సీగా ప్రకటిస్తారని దాసోజు శ్రావణ్‌ తమ వాదనలను వినిపించాడు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు ఎమ్మెల్సీల నియామకాలను కొత్తగా చేపట్టాలని తీర్పునిచ్చింది.గత జనవరిలో కోదండరాం, అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించడంతో గవర్నర్ అమోదించారు.కోర్టు వివాదం పెండింగ్‌లో ఉండగా నియామకాలు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరో పిటిషన్ దాఖలైంది. రెండు వేర్వేరు పిటిషన్లపై నేడు తీర్పు వెలువడింది. ఎమ్మెల్సీల నియామకాలను రద్దు చేయడానికి గవర్నర్‌‌కు అధికారం లేదని, పేర్లను క్యాబినెట్‌కు తిప్పి పంపాలని స్పష్టం చేసింది. మరో పిటిషన్‌లో కోదండరాం, అలీఖాన్‌ల నియామకంపై కోర్టు స్టే విధించింది. తాజాగా నియామకాలను రద్దు చేసింది. క్యాబినెట్‌ ద్వారా ఎమ్మెల్సీలపై సిఫార్సులను పరిగణలోకి తీసుకుని జాబితాను గవర్నర్‌కు పంపాలని ఆదేశించింది.

Updated : 7 March 2024 12:18 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top