తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్
X
తెలంగాణ ఇంఛార్జీ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు సీజే అలోక్ అరాధే ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం రేవంత్‌రెడ్డి, పాల్గొన్నారు. కాగా తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలను రాధాకృష్ణన్‌కు అప్పగించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. పూర్తి స్థాయి గవర్నర్లను నియమించే వరకు తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలను నిర్వర్తించాలని రాధాకృష్ణన్‌ను కోరుతూ రాష్ట్రపతి భవన్ ఓ లేఖ విడుదల చేసింది.
1957 మే 4న జన్మించిన సీపీ రాధాకృష్ణన్.. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు భారతీయ జనతా పార్టీ తరుఫున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డ్ ఛైర్మన్‌గా సేవలందించారు. తమిళనాడు బీజేపీ నాయకుల్లోమంచి గుర్తింపు పొందారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 1998,1999లో బీజేపీ ఎంపీగా గెలిచి... 2004, 2009, 2019లో ఓడిపోయారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేశారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.