Home > తెలంగాణ > Tamilisai : తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

Tamilisai : తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

Tamilisai : తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
X

సైబర్ నేరగాళ్లు రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారుల ట్వట్టర్ అకౌంట్లపై పడ్డారు. వరుసగా నేతల ట్విట్టర్ అకౌంట్ల హ్యాకింగ్ కు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ట్విటర్ హ్యాక్ కు అయింది. సైబర్ నేరగాళ్లు గవర్నర్ ట్వీటర్ అకౌంట్ ను హ్యాక్ చేసినట్లు రాజ్ భవన్ అధికారులు తెలిపారు. డీపీలు మార్చుతూ, సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా వాటిని నమ్మొద్దని సూచించారు.

కాగా గతంలో ఆర్జీసీ ఎండీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఇటీవల రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఫేస్ బుక్ పేజ్ కూడా హ్యాక్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా గవర్నర్ అకౌంట్ నే హ్యాక్ చేయడంతో సైబర్ నేరగాళ్లను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.





Updated : 17 Jan 2024 12:09 PM IST
Tags:    
Next Story
Share it
Top