Home > తెలంగాణ > దివ్యాంగుల ఫించను పెంపు ఉత్తర్వులు జారీ

దివ్యాంగుల ఫించను పెంపు ఉత్తర్వులు జారీ

దివ్యాంగుల ఫించను పెంపు ఉత్తర్వులు జారీ
X

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆసరా పింఛను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వారికి ప్రతి నెల రూ.3,016 చొప్పున ఆసరా పెన్షన్ ఇస్తుండగా తాజా పెంపుతో రూ.4,016 అందుకోనున్నారు. ఈ నెల నుంచే పెరిగిన మొత్తం ఖాతాలో పడనుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దివ్యాంగులకు అందించే ఆసరా పింఛన్‌ను అదనంగా రూ.వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తాజాగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,16,890 మంది దివ్యాంగులకు నెలకు రూ.3,016 పింఛన్‌ ఇస్తున్నారు. తద్వారా ఏటా రూ.1800 కోట్లు ఖర్చుపెడుతున్నారు. తాజా పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.600 కోట్ల అదనపు భారం పడనుంది. ఆసరా పింఛను మరో రూ.1000 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు.




Updated : 22 July 2023 8:00 PM IST
Tags:    
Next Story
Share it
Top