Home > తెలంగాణ > నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్..1827 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్..1827 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్..1827 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
X

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‎న్యూస్ చెప్పింది. మరొక ఉద్యోగ నోటిఫికేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన భర్తీ చేయనున్నది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తెలంగాణ రాష్ట్రం రాకముందు కేవలం 5 మెడికల్ కాలేజీలు ఇప్పుడు 26 కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. వచ్చే ఏడాదిలో మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన వైద్యులను, నర్సులను, ఇతర సిబ్బందిని భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేయగా... ప్రస్తుతం 1827 మంది స్టాఫ్ నర్సులను భర్తీ చేసుకోబోతున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు.

Updated : 23 Jun 2023 6:57 PM IST
Tags:    
Next Story
Share it
Top