Home > తెలంగాణ > తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1ను రద్దు చేసింది

తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1ను రద్దు చేసింది

తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1ను రద్దు చేసింది
X

గ్రూప్ 1 రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. గత ప్రభుత్వం 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అదనంగా 60 పోస్టులను కలుపిన రేవంత్ సర్కార్.. ఈ మేరకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్న తెలిపింది.

బీఆర్ఎస్ హయాంలో గ్రూప్-1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా పేపర్ లీక్ కావడంతో అప్పటి ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. ఆ తర్వాత మళ్లీ రాత పరీక్షను నిర్వహించగా.. బయోమెట్రిక్ సమస్యలు, ప్రశ్న పత్రంలో తప్పులు దొర్లాయి. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా గ్రూప్ 1 పరీక్షను రెండోసారి రద్దు చేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఆ కేసు ఉపసంహరించుకునేందుకు సిద్ధమైంది.

తాజగా ఈ కేసు ఫిబ్రవరి 19న సుప్రీంకోర్టులో విచారణకు రాగా.. ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ పై స్పష్టతనిచ్చింది. ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.2022లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ నోటిఫికేషన్ రద్దు కావడంతో టీఎస్పీఎస్సీ కొత్తగా కలిపిన 60 పోస్టులతో కలుపుకుని మొత్తం 563 పోస్టులతో త్వరలో కొత్త నోటిఫికేషన్‌ విడుదలచేయనుంది.





Updated : 19 Feb 2024 5:28 PM IST
Tags:    
Next Story
Share it
Top