Optional Holiday Today: సీఎస్ ఆదేశాలు.. ఇవాళ సెలవు
విద్యాసంస్థలకు నేడు సెలవు
X
రాష్ట్రంలో ఈరోజు ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ బలిదానానికి సంస్మరణగా 40వ రోజు షియా ముస్లింలు అర్బాయిన్‌ను జరుపుకుంటారు. అయితే ఈ సందర్భంగా గతంలో ఈ నెల 6వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఓ సర్క్యులర్ జారీ చేశారు. అయితే తాజాగా ఆ సెలవును 7వ తేదీకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ పేర్కొన్న కారణాల దృష్ట్యా బుధవారం బదులుగా 7వ తేదీన సెలవును ఇవ్వడం జరిగింది. అరబియన్ ఐచ్ఛిక సెలవు ప్రకటించారు. దీంతో అర్బాయిన్ జరుపుకునే ప్రాంతాల్లో ఈరోజు సెలవు ఉండనుంది.
ఇక ఈ రోజే రాష్ట్రంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కొన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడి అజరామరమైన బోధనలు అన్ని తరాలకు స్ఫూర్తిని నింపుతాయని, మన కర్తవ్యాన్ని నిజాయతీ, చిత్తశుద్ధి, భక్తితో నిర్వర్తించడానికి మార్గదర్శకంగా నిలుస్తాయని గవర్నర్ పేర్కొన్నారు. శ్రీకృష్ణుడి జీవితాన్ని అవలోకనం చేసుకుంటే స్థితప్రజ్ఞులుగా ఎదగవచ్చని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయన కృపాకటాక్షాలు ప్రజలందరికీ అందాలని ఆకాంక్షించారు.