Home > తెలంగాణ > Traffic challans last date: ట్రాఫిక్‌ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే..?

Traffic challans last date: ట్రాఫిక్‌ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే..?

Traffic challans last date: ట్రాఫిక్‌ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే..?
X

రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ స్కీం ఇవాళ్టితో ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలాన్లపై ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ గడువును పెంచింది. ఈ నెల 31వ తేదీ వరకు పెండింగ్ చలాన్ల రాయితీ గడువును పొడగించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 25 వరకు పెండింగ్ లో ఉన్న చలాన్లను క్లియర్ చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. గత డిసెంబర్ 26 నుంచి ఈ స్కీం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా డిస్కౌంట్ స్కీం నేపథ్యంలో ఇప్పటి వరకు 1.14కోట్ల చలాన్లు క్లియర్ అయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అత్యధికంగా 66.57 లక్షల చలాన్లు చెల్లించినట్లు అధికారులు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 2.45 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించేందుకు వాహనదారులు ప్రయత్నిస్తుండటంతో సర్వర్ పై ఒత్తిడి పెరిగిన ఈ-చలాన్‌ సైట్‌ ఓపెన్‌ కావడంలేదు. ఫలితంగా చలాన్లు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో డిస్కౌంట్ గడువును పొడిగించాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ క్రమంలో మరో వారం రోజుల పాటు ఈ పథకాన్ని పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సాయంత్రానికి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా ఇప్పటి వరకు కోటీ 7 లక్షల మంది మాత్రమే ఛలాన్లు కట్టగా.. రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది.




Updated : 10 Jan 2024 1:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top