Home > తెలంగాణ > గృహలక్ష్మి గైడ్ లైన్స్ ఖరారు.. జీవో నంబర్ 25ను జారీ చేసిన ప్రభుత్వం

గృహలక్ష్మి గైడ్ లైన్స్ ఖరారు.. జీవో నంబర్ 25ను జారీ చేసిన ప్రభుత్వం

గృహలక్ష్మి గైడ్ లైన్స్ ఖరారు.. జీవో నంబర్ 25ను జారీ చేసిన ప్రభుత్వం
X

తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను బుధవారం (జూన్ 21) విడుదల చేసింది. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రూ. 3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనుంది. సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకుంనేందుకు సాయంగా ఈ డబ్బు ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు గైడ్ లైన్స్ విడుదల చేస్తే ఆర్ అండ్ బీ సెక్రెటరీ విజయేంద్ర బోయి జీవో నంబర్ 25ను విడుదల చేశారు. ఈ స్కీమ్ కింద మొత్తం 4 లక్షల ఇల్లు సాంక్షన్ చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3 వేల ఇల్లు, స్టేట్ రిజర్వ్ కోటాలో 43 వేల ఇల్లు లబ్ధి చేకూరుతాయి.

దీనికోసం ప్రతీ సెగ్మెంట్ లో ఎస్టీలకు 10శాతం, ఎస్సీలకు 20 శాతం, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే జాగా పరిశీలన, ఫొటోలు, ఇతర అంశాలను పరిశీలించి వారం పది రోజుల్లో జీవో ఇవ్వనున్నారు. రూరల్ లో 120 గజాలు, అర్బన్ లో 80 గజాల భూమి ఉంటే ఇల్లు కట్టుకోవడానికి అర్హులని హౌజింగ్ అధికారులు ప్రభుత్వానికి పోయిన ఏడాది ప్రపోజల్స్ పంపించారు. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఎక్కువ రూల్స్ ఉన్నందున.. గృహలక్ష్మి స్కీంలో ఎక్కువ రూల్స్ పెట్టొద్దని ప్రభుత్వం అనుకుంటోంది. ఈ క్రమంలో ప్రభుత్వం జారీ చేసిన రూల్స్ ఎలా ఉన్నాయంటే..

గృహలక్ష్మి పథకం గైడ్ లైన్స్:

* మహిళ పేరు మీదే ఇల్లు సాంక్షన్ చేస్తారు

* వైట్ రేషన్ కార్డు, సొంత జాగా ఉంటేనే పథకానికి అర్హులు

* 2 రూమ్ లు, 1 టాయిలెట్​తో గృహలక్ష్మి ఇంటి నిర్మాణం.

* ఇంటి మీద గృహలక్ష్మి లోగో ఉండాల్సిందే

* జీవో 59 ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్లు అనర్హులు

* అర్హులైన వాళ్లు కలెక్టర్​కు అప్లికేషన్లు పెట్టుకోవాలి

* కలెక్టర్​కు ఎమ్మెల్యేలు కూడా లిస్ట్ అందజేయొచ్చు

* అప్లికేషన్లను ఫైనల్ చేసే బాధ్యత కలెక్టర్​దే

* గృహలక్ష్మి ఇళ్ల పంపిణీని దశల వారీగా మంజూరు చేస్తారు

* ఇంళ్లు రాని వాళ్లు వెయిటింగ్ లిస్ట్ గా పరిగణించబడతారు

* ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్, బిల్స్ ఫైనల్, బిల్స్ అప్రూవ్, బిల్స్ విడుదల అన్ని.. కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ స్టేట్ నోడల్ అకౌంట్ నుంచి లబ్ధిదారుల అకౌంట్ కు బదిలీ చేస్తారు

* గృహలక్ష్మి స్కీమ్ అమలు చేసేందుకు సీజీజీ ద్వారా ప్రత్యేకంగా మొబైల్ యాప్, పోర్టల్ ఉంటుంది

* ఆన్ లైన్ పోర్టల్ ద్వారానే స్కీమ్ అమలు చేస్తారు

* 3 స్టేజ్ లలో రూ.1లక్ష చొప్పున సహాయం అందుతుంది. బేస్​మెంట్ లెవల్, స్లాబ్, పూర్తయిన ఇల్లు.. అన్ని ఫొటోలను యాప్ లో అప్ లోడ్ చేయాలి

* ఈ స్కీమ్ కోసం మహిళ పేరు మీద ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉండాలి. అయితే వేరే ఏ ఇతర ట్రాన్సాక్షన్స్ కోసం ఈ అకౌంట్ ఉపయోగించరాదు

Updated : 22 Jun 2023 2:42 PM GMT
Tags:    
Next Story
Share it
Top