తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ.. సుదర్శన్‌రెడ్డికి కీలక పదవి
Bharath | 17 Dec 2023 4:40 PM IST
X
X
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే.. గతంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను మార్చడం సర్వసాధారణమే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలు శాఖల్లో మార్పులు చేపట్టింది. తాజాగా 11 మంది ఐఏఎస్ అధికారులను వివిధ శాఖలకు బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా బదిలీ అయిన ఐఏఎస్ ల వివరాలు..
- - మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా దాన కిషోర్
- - జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా
- - వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా శ్రీదేవి
- మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాకాటి కరుణ
- అటవీ పర్యావరణశాఖ కార్యదర్శిగా వాణి ప్రసాద్
- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల డైరెక్టర్ గా ఆర్ వి కర్ణన్
- విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రం వెంకటేశం
- హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి
- రోడ్లు, భవనాలతో పాటు రవాణా శాఖ కార్యదర్శిగా శ్రీనివాస్ రాజు
- విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అరవింద్ కుమార్
- HM& FW కమిషనర్‌గా క్రిస్టినా
Updated : 17 Dec 2023 4:40 PM IST
Tags: congress telangana cm revanth reddy cs shanthi kumari IAS transfers ts news ts politics vakati karuna sudarshan reddy
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire