Home > తెలంగాణ > చికెన్, మటన్ బంద్.. జైలు ఖైదీలకు ఎంత కష్టం వచ్చిందో..

చికెన్, మటన్ బంద్.. జైలు ఖైదీలకు ఎంత కష్టం వచ్చిందో..

చికెన్, మటన్ బంద్.. జైలు ఖైదీలకు ఎంత కష్టం వచ్చిందో..
X

తెలంగాణ ఖైదీలకు పోలీస్ అధికారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఖైదీలకు ఇచ్చే మెనూలో చికెన్, మటన్ ను బంద్ చేశారు. ఇదివరకు ఖైదీలకు ఇచ్చే ఆహారంలో భాగంగా వారానికోసారి మాంసం వడ్డించేవారు. చికెన్, మటన్ మోతాదులో ఇచ్చేవాళ్లు. తెలంగాణ ప్రధాన కారాగారాలైన చంచల్ గూడ, చర్లపల్లి జైల్లో గత రెండు వారాలనుంచి మటన్, చికెన్ నిలిపివేశారు.

సరిపడ బడ్జెట్ లేకపోవడంవల్ల.. నిధుల కొరతతో నేరస్తుల కడుపు మాడుస్తున్నారని ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, మాంసం సప్లై చేసే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి అందే ఫండ్స్ నిలిచిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టర్లకు దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగా బకాయి పడింది. దాంతో వాళ్లు సప్లైని నిలిపివేశారు. ప్రస్తుతం పప్పు, సాంబార్ తోనే ఖైదీలకు ఆహారాన్ని సరిపెడుతున్నారు.

Updated : 14 Jun 2023 4:05 PM IST
Tags:    
Next Story
Share it
Top