Home > తెలంగాణ > కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ

కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ

కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ
X

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ నుంచి నీటిని తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది. కేంద్రం కలగజేసుకుని ప్రాజెక్టు వద్ద భద్రతను సమీక్షించింది. ఈ క్రమంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వాహణను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించాలని కేంద్రం సూచించింది. దీనికి తెలుగు రాష్ట్రాలు సైతం అంగీకరించాయి. ఇవాళ కేఆర్ఎంబీ మరోసారి సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రాజెక్టుల నిర్వహణ అప్పగింతకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు.

ఈ క్రమంలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. జనవరి 17న ఢిల్లీలో జరిగిన సమావేశం మినట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా లేఖ రాశారు. కృష్ణా ప్రాజెక్టుల స్వాధీనంలో తమ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదని లేఖలో ఆరోపించారు. ప్రాజెక్టుల స్వాధీనంలో తెలంగాణ షరతులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. జనవరి 17న జరిగిన సమావేశం మినట్స్‌ను సవరించాలని రాహుల్‌ బొజ్జా కోరారు. దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Updated : 1 Feb 2024 3:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top