Home > తెలంగాణ > Boinapally saritha:పరీక్ష రాయకుండానే AE ఉద్యోగం.. పనిచేయకుండానే రూ.లక్షల జీతం..!!

Boinapally saritha:పరీక్ష రాయకుండానే AE ఉద్యోగం.. పనిచేయకుండానే రూ.లక్షల జీతం..!!

Boinapally saritha:పరీక్ష రాయకుండానే AE ఉద్యోగం.. పనిచేయకుండానే రూ.లక్షల జీతం..!!
X

బీఆర్ఎస్‌కు చెందిన ఓ మాజీ ఎంపీ దగ్గరి బంధువుకి గతంలో ప్రభుత్వ ఉద్యోగం కట్టబెట్టారన్న ఆరోపణలపై కాంగ్రెస్ సర్కార్ విచారణ చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)లో గతంలో నిబంధనలకు విరుద్ధంగా సరిత(Boinapally Saritha Rao) అనే యువతికి అసిస్టెంట్ ఇంజనీర్(AE) ఉద్యోగం ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టి, వివరాలన్నీ సేకరిస్తున్నారు.

నిబంధనల ప్రకారం సాధారణ పద్ధతిలో AE పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయిలో రాతపరీక్ష నిర్వహించి మెరిట్‌ జాబితా ప్రకారం ఉద్యోగాలివ్వాలి. కాగా ఈ యువతి తొలుత కాంట్రాక్టు విధానంలో టెక్నికల్‌ అసిస్టెంటు(Technical Assistant)గా జాబ్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఆ తరవాత జెన్‌కో(TSGENCO) పాలకమండలి ఆమోదంతో ఏఈగా ఉద్యోగాన్ని రెగ్యూలరైజ్ చేశారని ప్రభుత్వ విచారణలో గుర్తించారు. కానీ ఏఈగా ఉద్యోగం రెగ్యులర్‌ అయినా... ఆమె సచివాలయంలో రోజువారీగా పనిచేయాలని ఉత్తర్వులిచ్చినట్లు జెన్‌కో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. సచివాలయానికి ఆమెను బదిలీ చేసిన ఉత్తర్వుల కాపీని, అక్కడ విధుల్లో చేరినట్లు అప్పట్లో ఆమె ఇచ్చిన అపాయింట్‌మెంట్ లెటర్‌ను సైతం ఉన్నతాధికారులకు జెన్‌కో అధికారులు శనివారం అందజేశారు. విద్యుత్‌ సంస్థల్లో ఇలా రాజకీయ నేతల బంధువులు, అనుచరులకు ఇంకా ఏమైనా గతంలో ఉద్యోగాలిచ్చారా అనే వివరాలను సైతం ప్రభుత్వం సేకరిస్తోంది.

ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. నాటి జెన్‌కో చైర్మన్ ప్రభాకర్ రావు.. ఆమెకు ఈ ఉద్యోగం మంజూరు చేశారని.. ఆ పోస్టుతో ఆమె నిన్న మొన్నటి వరకూ పనిచేయకుండా ఇంట్లోనే ఉంటూ నెలకి రూ. లక్షల తీసుకుందని కొందరు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో గత ప్రభుత్వం ఓడిపోగానే.. ఆమె వెంటనే వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయిందంటున్నారు. అసలు ఈమె ఎప్పుడు ఎగ్జామ్ రాసింది? ఎప్పుడు రిక్రూట్ అయింది? తోటి ఉద్యోగులుని ఆరా తీస్తే ఈ నిజం వెలుగులోకి వచ్చిందంటున్నారు.




Updated : 7 Jan 2024 7:31 AM IST
Tags:    
Next Story
Share it
Top