Home > తెలంగాణ > సీఎం రేవంత్ ఆదేశం.. రైతుల అకౌంట్లలోకి రైతు బంధు నిధులు

సీఎం రేవంత్ ఆదేశం.. రైతుల అకౌంట్లలోకి రైతు బంధు నిధులు

సీఎం రేవంత్ ఆదేశం.. రైతుల అకౌంట్లలోకి రైతు బంధు నిధులు
X

రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతులకు పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఎన్నికల వేళ రైతులకు రైతు భరోసా పేరుతో 15వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదు. దీంతో గతంలో రైతుబంధు మాదిరి రైతులకు పెట్టుబడి సాయం చెల్లింపులు చేయాలని సీఎం ఆదేశించారు.

Updated : 11 Dec 2023 8:49 PM IST
Tags:    
Next Story
Share it
Top