కోకాపేట మజాకా..ఎకరం రూ.35 కోట్లు !.. హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ జారీ
Mic Tv Desk | 7 July 2023 7:25 PM IST
X
X
హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలోని భూముల అమ్మకం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందిన సర్కార్.. మరోమారు వేలానికి సిద్ధమైంది. ఈ సారి 45 ఎకరాలను విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. 45 ఎకరాల్లో 7 ప్లాట్లను హెచ్‌ఎండీఏ విక్రయానికి వేలం వేయనుంది. ఈ ప్లాట్లు మూడెకరాలు నుంచి తొమ్మిది ఎకరాల వరకు ఉన్నాయి.
ఎకరానికి కనీస ధర రూ.35 కోట్ల వరకు నిర్ణయించింది. ఈ వేలంలో భూములు కనీస ధరకు పోయినా దాదాపు రూ.1,600 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. డిమాండ్ ఎక్కువ ఉండటంతో 2,500 కోట్లు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 20వ తేదీన ప్రీబిడ్ సమావేశం జరగనుంది. వేలం రిజిస్ట్రేషన్‌కు నెలాఖరు వరకు అవకాశం ఉంది. ఆగస్టు 3న ‘ఈ- వేలం’ ద్వారా భూములను విక్రయం కొనసాగనుంది. గత వేలంలో కోకాపేట భూములకు కోట్లు పలికిన సంగతి తెలిసిందే.
Updated : 7 July 2023 7:41 PM IST
Tags: Telangana government e auction 7 plots Kokapet lands Telangana Govt To E-Auction One Acre Land Cost 35 cr Govt To E-Auction 7 plots in Kokapet trending news today current trending topics Today Trending News in Telugu news telugu news telugu today breaking news in telugu Mic Tv Telugu news
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire